Itlu Maredumilli Prajaneekam Vs Thodelu: నవంబర్ 25వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు సుమారు 6 సినిమాల దాకా వచ్చాయి.  కానీ ముఖ్యంగా మూడు సినిమాలకు ఎక్కువగా బజ్ ఏర్పడింది. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా ఒకటి డైరెక్ట్ రిలీజ్ మూవీ. డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే వరుణ్ ధావన్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటించిన భేడియా అనే సినిమాని తెలుగులో తోడేలు పేరుతో రిలీజ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఇవాన హీరోయిన్ గా తమిళంలో లవ్ టుడే పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమాని అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అదే విధంగా నరేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే దక్కించుకుంటోంది.


అయితే ఇక్కడ తోడేలు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలకి ఒక కనెక్షన్ అయితే కనిపిస్తోంది. తోడేలు సినిమా లైన్ ఏమిటంటే ఆధునీకరణ పేరుతో అడవుల్లోకి వెళ్లి అక్కడ రోడ్లు వేయాలి అనుకుంటున్న వ్యక్తిని అక్కడి అడవిని కాపాడే తోడేలు కరిస్తే అతను తోడేలుగా మారి చివరికి ఆ అడవిని నాశనం చేయకుండా ఎలా అడ్డుకున్నాడు అనేది. అయితే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం లైన్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా సాగుతుంది.


ఎక్కడో అడవిలో నివసిస్తూ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని కనీస వసతులు కూడా లేని సుమారు 250 మంది ప్రజానీకం తమ గ్రామానికి విద్య, వైద్యం సౌకర్యాలతో పాటు అక్కడికి వచ్చే బ్రిడ్జి, రోడ్డు ఎలా దక్కించుకున్నారు అనేది. ఒక రకంగా చూస్తే రెండు భిన్నమైన కాన్సెప్ట్ లు. అయినా రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సాగాయి. వరుణ్ ధావన్ సినిమాని పూర్తిగా హిందీలో తెరకెక్కించగా తెలుగులో కూడా రిలీజ్ చేశారు.


గీతా ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇక ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా విషయానికి వస్తే ఈ సినిమాని రాజేష్ దండా హాస్య ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద అలాగే జీ స్టూడియోస్ సంస్థ సహ నిర్మాణంతో తెరకెక్కించారు. ఏఆర్ మోహన్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. వెన్నెల కిషోర్, రఘుబాబు, ప్రవీణ్, సంపత్ రాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు.


Also Read: Thodelu Movie Review: వరుణ్ థావన్ 'తోడేలు' కాటు వేసిందా?.. సినిమా ఎలా ఉందంటే?


Also Read: Itlu Maredumilli Prajaneekam Review : అల్లరోడి కొత్త సినిమా ఎలా ఉందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook